ఘనంగా హిందూపురం జనసేన ఇంచార్జ్ ఆకుల ఉమేష్ జన్మదిన వేడుకలు

హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ జన్మదిన వేడుకను హిందూపురం జనసేన నాయకులు, జన సైనుకులు ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా రోటరీ క్లబ్ నందు వేడుకను నిర్వహించి కేక్ కట్ చేసి.. రక్త దాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. అదేవిధంగా హిందూపురం పట్టణంలోని బాపూజీ నగర్ జనసైనికులు భారీ గజమాలను ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆకుల ఉమేష్ మాట్లాడుతూ.. మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలియచేసి.. ఇంతటి అభిమానానికి కారణమైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.