కంచికచర్ల జనసేన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

నందిగామ, కంచికచర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పెద్ద బజారులో గల మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు అని కీర్తించారు.స్వాతంత్ర్య ఫలాలు దేశంలో ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. భారతదేశ మలి ప్రధాని, స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న లాల్ బహదూర్ శాస్త్రి జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. వీరిద్దరూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యులు. సత్యము, అహింస మార్గము ద్వారానే స్వాతంత్య్రం సాధించవచ్చని తెలిపిన మహనీయులు అని చెప్పారు.అందరికీ సమానంగా పరిపాలన చేరువవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో వనపర్తి పద్మారావు, కుర్ర నాని, కొటారు దేవేంద్ర, దేవిరెడ్డి అజయ్ బాబు, పెరుమాళ్ళ సురేష్, పెద్దినేడి హరిబాబు, జెర్రిపోతుల చంటిబాబు, పుప్పాల వేణుగోపాల్, కోటి తదితరులు పాల్గొన్నారు.