జ్యోతిరావు పూలే ఆశయసాధనే జనసేన లక్ష్యం: నేరేళ్ళ సురేష్

గుంటూరు, సమాజంలో నెలకొన్న కుల వివక్షను, సామాజిక అసమానతలను పారద్రోలేందుకు తన జీవిత పర్యంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అసాయసాధనే లక్ష్యంగా జనసేన పార్టీ నిరంతర కృషి చేస్తుందని గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. మంగళవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్టీ నగర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ అగ్రకులాల వారికి బానిసలుగా బ్రతుకుతున్న అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని రగిల్చిన గొప్ప సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. దుర్మార్గమైన కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ గట్టిగా నినదించిన తొలి దార్శనికుడు పూలే అని పేర్కొన్నారు. స్త్రీ, పురుష లింగ భేదాన్ని పూలే సహించలేదని, సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమాజాన్ని పూలే ఆకాంక్షించారన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంభేడ్కర్ సైతం మహాత్మా జ్యోతిరావు పూలేని తన గురువుగా ప్రకటించారని నేరేళ్ళ సురేష్ అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ప్రధాన కార్యదర్శిలు ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర, నగర కార్యదర్శి కలగంటి త్రిపుర కుమార్, ఎస్.కె రజాక్, అందే వెంకటేశ్వరరావు, నగర సంయుక్త కార్యదర్శులు పులిగడ్డ గోపి, సుంకే శ్రీనివాసరావు, బందెల నవీన్ బాబు, మీడియా కోఆర్డినేటర్ పుల్లంశెట్టి ఉదయ్ కుమార్ మరియు డివిజన్ అధ్యక్షులు తోటకూర విజయ్, కొనిదే దుర్గాప్రసాద్, ఏడుకొండలు, పవన్ వెంకీ, బడే రామకృష్ణ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.