జనసేన ఆవిర్భావదినోత్సవ సభను విజయవంతం చేయండి.. అక్కల రామ్మోహన్ రావు

మైలవరం: మైలవరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) మాట్లాడుతూ జనసేన పార్టీ 10వ ఆవిర్భావదినోత్సవ వేడుకలలో భాగంగా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న దిగ్విజయ సభను మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ దిగ్విజయ సభ, ఈ రాష్ట్ర దశాదిశను నిర్ణయించబోతుందని, ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపి, 2024 ఎలక్షన్స్ కు సమర శంఖం పూరించబోతున్నారని, 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుందని తెలిపారు. మార్చి14న ముందుగా మైలవరం పార్టీ ఆఫీసులో జనసేన జెండాను ఎగురవేసి, బహిరంగ సభకు బయలుదేరుతారని, జనసైనికులు, వీరమహిళలు అందరూ కూడా ఉదయం 9 గంటలకు మైలవరం పార్టీ ఆఫీస్ వద్ద హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, మండల నాయకులు చంద్రాల మురళీకృష్ణ, భూక్య చిరంజీవి, పొన్నూరు విజయ్ కుమార్, ఆనం విజయకుమార్, పసుపులేటి నాగరాజు, తోట మాధవరావు, మాదాసు సుబ్బారావు మరియు జనసైనికులు మర్రి కొండలరావు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.