కౌలురైతు భరోసాయాత్రను విజయవంతం చేయండి: కరిమి కొండ సురేష్

గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 18న కౌలు రైతుల భరోసా యాత్ర జరుగుతుందని జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండల అధ్యక్షులు కరిమి కొండ సురేష్, మండల కమిటీ సభ్యులు వెల్లడించారు. జనసేన మండల కార్యాలయంలో మాట్లాడుతూ ఈ యాత్రలో 300 మందికి ఆర్థిక భరోసాను అందించనున్నారని వెల్లడించారు. దీంతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, రాష్ట్రంలో మూడు వేల మంది పైచిలుకు కౌలురైతులు ఆత్మ చేసుకుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. కౌలు రైతుల భరోసా యాత్రకు విజయం చేకూరాలని పెనమలూరు మండలంలోని జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు, ఉపాధ్యక్షులు, చెన్నా గాంధీ, వంకాయలపాటి ప్రవీణ్, కార్యదర్శిలు లంకే శ్రీనివాస్ రావు, ఈ. శివ, పోతన వాసు, టి. సుదీర్, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.