మూలస్థానేశ్వర స్వామి ఆలయ కోనేటికి మరమ్మతులు చేపట్టండి: సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామ జనసేన పార్టీ గ్రామ పర్యటనలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు మరియు జనసైనికులు మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కోనేరును పరిశీలించడం జరిగింది. ఈ కోనేరు సర్వేపల్లి గ్రామ పంచాయతీ నందు ఎంతో విశిష్టత కలిగిన దేవాలయం మూలస్థానేశ్వర స్వామి ఆలయ కోనేరు. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత కలిగి పరమశివుడు లింగ రూపంలో కాశీలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే లింగరూపంలో ఉంటాడు. ఎంతో మహిమ కలిగిన ఈ శివాలయం ఎండోమెంటు ఆధీనంలో ఉంది. ఈ శివాలయానికి 40 ఎకరాల పై భూమి ఉంది.. అదేవిధంగా ఎండోమెంట్ వారు ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ కోనేరులో శివపార్వతులకళ్యాణం తర్వాత తెప్పోత్సవం జరుగుతుంది. గతంలో ఈ కోనేరు నీళ్లు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా తాగునీటి కి వాడుకొనేవారు.. ఈ రోజు అక్కడ చూస్తే పరిశుభ్రత లోపించి.. ఆ కోనేరులో నీళ్లు పాచి పట్టి.. ప్లాస్టిక్ కవర్లతో.. మందు బాటిల్లతో అస్తవ్యస్తంగా తయారైంది. అదేవిధంగా కొన్ని కులాలకు సంబంధించిన వారు కర్మ క్రతువులు చేసుకుంటారు కానీ అక్కడ సరైన వసతులు లేకపోవడం దారుణమైన పరిస్థితి.. ఇకనైనా గుర్తించి మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరపున సురేష్ నాయుడు కోరారు.