వారాహి విజయ యాత్రను విజయవంతం చేయండి!

పాలకొండ: వారాహి విజయ యాత్రను విజయవంతం చేయండి అని జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ కోరారు. జానీ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో మే 2 తేదీన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజుపేట జంక్షన్ దగ్గర నుంచి వారాహి భయలుదేరుతూ కాంప్లెక్స్ పాయింట్ వడుమ జంక్షన్ దగ్గర వరుకు పర్యటించనున్నారు. కనుక ఉత్తరాంద్రకి సంబందించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం కి సంబందించిన నాలుగు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జనసేన నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు టీడీపీ నాయుకులు, కార్యకర్తలు, బీజేపీ నాయుకులు, కార్యకర్తలు మరియు చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అభిమానులు ప్రజలు అందరికి ముఖ్య విషయం మన పాలకొండకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన జనసేన యం యల్ ఏ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గెలుపు కోసం మన పాలకొండకి రావడం జరుగుతుంది. కనుక ప్రజలు అభిమానులు అందరూ రావాలి అని, జయకృష్ణ గెలుపు భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అని కోరుకుంటున్నాను అని, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాబ్బది ఫకీర్ నాయుడు, పాలకొండ నియోజకవర్గం నాయుకులు మత్స పుండరీకం, రౌతు గోవిందా నాయుడు, మాచర్లచందు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.