ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలి: పెండ్యాల శ్రీలత

అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం, నార్పల మండలం, గంగనపల్లి గ్రామంలో జనసేన పార్టీ తరపున మహిళా సాధికారత కోసమై చిన్న, సన్నకారు రైతులు 15 ఎకరాలలో పంట సాగు చేశారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా అందులో తొమ్మిది ఎకరాల అరటితోట గాలివాన కారణంగా పూర్తిగా పడిపోవడం జరిగింది. నాలుగైదు రోజులలో కోతకు సిద్ధంగా ఉన్న సుమారు 150 టన్నుల పంట. ఇదే కాకుండా గంగనపల్లి గ్రామంలోని 100 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. మా సొంత పొలాలే 45టన్నుల వరకు నష్టపోయామని, మేము నష్టపోయాం కానీ చిన్నకారు రైతులు నష్టపోయి నిలబడడం చాలా కష్టమని, అనంతపురం జిల్లాలో వేల ఎకరాల అరటితోట, వివిధ రకాల పంటలు నష్టపోవడం జరిగిందని ప్రతి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ధైర్యం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత తెలిపారు.