సిద్ధి వినాయకుని అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న మాకినీడి

కాకినాడ జిల్లా, పిఠాపురం టౌన్ 25వ వార్డు సీతయ్య తోటలో సిద్ధి వినాయకుడు అన్నసంతర్పణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి హాజరవ్వడం జరిగింది. అక్కడ పలువురు జనసైనికులు నాయకులు మర్యాదపూర్వకంగా సాలువతో సత్కరించి ఆమెను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ.. ముఖ్యంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం ముందుగా పూజించే మహాగణపతి అని ఈరోజు అన్నదానంలో నేను పాల్గొనడం చాలా సుభ సూచికం అలాగే జనసేన పార్టీకి ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉంటాయని ఆశిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్. ఎస్ ఎన్ మూర్తి, యేలేశ్వరపు భాను,తోట సతీష్, పబ్బిరెడ్డి దుర్గాప్రసాద్, నామా శ్రీకాంత్, నామా సాయి, కసిరెడ్డి నాగేశ్వరరావు, దొడ్డి లక్ష్మీనారాయణ, జనసైనికులు, నాయకులు, ఆలయ కమిటీసబ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *