బొబ్బిలిలో మనఊరు మనఆట సంక్రాంతి సంబరాలు

బొబ్బిలి నియోజకవర్గం: బాడంగి మండలం, గొల్లది గ్రామంలో మన ఊరు మన ఆట సంక్రాంతి పండగ తెలుగు వారి సంస్కృతి సమ్మేళనంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గులు పోటీల్లో గెలిచిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇంచార్జి చేతులు మీదంగా అందజేయడం జరిగింది. ముగ్గులు పోటిల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీటీసీ పామోటి సత్యవతి, మాజీ సర్పంచ్ బేతనపల్లి పార్వతి, సింహాచలం, శృతి, గౌరి, అప్పలనాయుడు, గొల్లది జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.