మూడో విడత సభ్యత్వాల గురించి మండల స్థాయి చర్చలు

మంగళవారం రాజుపాలెం మండల జనసేన పార్టీ కార్యాలయంలో గ్రామ కమిటీల గురించి, బూత్ కమిటీల గురించి చర్చించడం జరిగింది. అలాగే ఈనెల 10వ తేదీ నుండి జరగవలసిన మూడో విడత సభ్యత్వాల గురించి మండల స్థాయిలో చర్చించడం జరిగినది. అలాగే రాజుపాలెం తిరుణాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల ప్రెసిడెంట్ తోట నరసయ్య మండల బత్తుల హనుమంతరావు గ్రంధి సదాశివరావు, గలభ నాగేశ్వరరావు, రాజుపాలెం గ్రామ అధ్యక్షులు నారపుశెట్టి కోటేశ్వరరావు, మొక్కపాడు గ్రామ అధ్యక్షులు పోకల శ్రీనివాస్, కార్యదర్శి కంభంపాటి వర ప్రసాద్, కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, కొండమోడు గ్రామ అధ్యక్షుడు దూదేకుల శ్రీను భాషా, కార్యదర్శి రుసుం వెంకటేశ్వర్లు, తోట మణికంఠ, పెమ్మా రమేష్, పోశం శ్రీనివాసరావు మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.