చంద్రబాబు అరెస్ట్‌ తీరు అప్రజాస్వామికం: సన్యాసి నాయుడు

  • జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు శృంగవరపుకోట

శ్రీనగవరపుకోట: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తీరు అప్రజాస్వామికమని జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నామన్నారు. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం అన్నారు. పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదన్నారు. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని జనసేన కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు. ప్రజలని భయభ్రాంతులను చేయ్యడానికే జగన్ ఇలా చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు నే వదలలేదు. ఇక మీరు ఎంత అని సామాన్యలను హెచ్చరించడానికే ఇలా చేస్తున్నారని అన్నారు ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు.. అక్రమ అరెస్ట్లకు భయపడేది లేదన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపి తీరుతామన్నారు. సోమవారం టిడిపి నేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎస్. కోటలో జరుగుతున్న బంద్ కు జనసేన సంపూర్ణ మద్దతు తెలుపుతూ బంద్లో జనసాయినికులు పాల్గొన్నారని అరెస్ట్ చేసిన టీడీపీ జనసేన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో మరల నిరసన కార్యక్రమము చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గండవరపు సతీష్, మల్లువల్స్ నాని తదితరులు పాల్గొన్నారు.