రాజానగరం జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం

  • జనసంద్రం అయిన గాదరాడ
  • జనసేనానికి కృతజ్ఞతలు తెలిపిన బత్తుల

రాజానగరం, రాజానగరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జిగా బత్తుల బలరామకృష్ణను నియామకంతో జనసేన నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కోరుకొండ ప్రధాన రహదారులు బైక్ ర్యాలీతో మారుమోగడం జరిగింది. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మంగళ హారతులతో వారికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించి సన్మానించారు. అక్కడి నుంచి కోరుకొండ ప్రధాన రహదారి మీదుగా సుమారు 1000 బైకులతో, 50 కార్లతో భారీ ర్యాలీ చేపట్టి గాదరాడ నుండి కోరుకొండ శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తు పార్టీకి సేవలందించిన సేవను గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఇన్చార్జిగా నియామకపత్రాన్ని అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాబోయే ఎలక్షన్లలో జనసేన పార్టీని గెలిపించి రాష్ట్ర సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని విభేదాలు సృష్టించినా అవన్నీ కేవలం తప్పుపట్టడానికి అని జనసేన పార్టీలో ఎటువంటి వర్గపోరులు గాని, విభేదాలు గానీ ఎటువంటివి లేవని స్పష్టం చేశారు. ప్రజలు జనసేన పార్టీకె ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని చెప్పారు. ఎండ వాన తేడా లేకుండా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ కోసం పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేస్తున్నారని జనసేన నాయకులను కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గలో ఉన్న అన్ని మండలాల నుంచి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.