సమస్యలే లేని నగరంలా నెల్లూరు నగరాన్ని చేస్తా: మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు: జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ గడప గడప కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక మూడవ డివిజన్ మైపాడు రోడ్డు వేణుగోపాల్ నగర నుండి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 28 డివిజన్లలో ఒకేసారి ప్రారంభించడం జరిగింది. స్థానిక బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టేవెంకటేశ్వర్లు ఆధ్యర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది, మనుక్రాంత్ రెడ్డి అధ్యర్యంలో స్థానిక యువత పెద్దయెత్తున్న పార్టీలో చేరి రాబోయే రోజుల్లో నగర నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా మనుక్రాంత్ రెడ్డిని అఖండ విజయంతో గేలిపించుకుంటామని తెలియజేసారు, చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన మూడున్నర సంవత్సరాలు కాలంలో వైసీపీ పాలనలో సామాన్యుల జీవితాలు బతుకు భారమై పోయింది నిత్యవసర సరుకులు కరెంటు చార్జీలు అమాంతం పెంచేసి రోడ్లు దుస్థితి దారుణమైన పరిస్థితిలో ఉండగా జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తుంది, ఉద్యోగస్తులు జీతాలు సమయానికి అందించలేక యువతకు ఉపాధి కల్పించలేకపోతున్నారు నెల్లూరు జిల్లాలో దౌర్జన్యాలు దాడులు పెట్టరేగిపోయి ఒక క్రైమ్ క్యాపిటల్ తయారైపోతుంది వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజల ఆరోగ్యానికి హానికరం అన్న చందాన వ్యవహరిస్తుంది ఎప్పుడు ఎప్పుడు ఈ ప్రభుత్వం గద్దె దిగుతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారు రాబోయే కాలంలో పొరపాటున వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే రాష్ట్రం నుండి అనేక ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయే భావన ప్రజల్లో ఏర్పడుతుంది. కోట్లాది రూపాయలు సంపాదన విదేశాల్లో సొంత వ్యాపారాలను వదిలి సొంత ఊరికి పుట్టిన గడ్డకి ఏదైనా మేలు చేయాలన్న తపనతో ఈసారి అధిష్టానం ఆదేశాలతో నగర ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నగర ప్రజలు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఎమ్మెల్యే పదవికి గౌరవం తీసుకొచ్చే విధంగా మరియు హుందా తనంగా వ్యవహరించి ప్రజా సమస్యలపై పోరాటం కాకుండా సమస్యలే లేని నగరంగా తీర్చిదిద్దుతాను, ప్రత్తి ఒక్కరు ఆలోచించి గాజు గ్లాసు పై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నగర పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని మూడో డివిజన్ నుండి జనసేన పార్టీ గడప గడప ప్రారంభించడం జరిగింది. వైసిపి ప్రభుత్వానికి కంచుకోటల ఉండే నెల్లూరూ నగరంలో రాబోయే ఎన్నికల్లో జనసేన జండా అఖండ విజయంతో ఎగరడం ఖాయం, వైసీపీ పార్టీలో జిల్లాలో నుండి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వలసలు వెళ్లిపోయారు రాబోయే రోజుల్లో మరి కొంతమంది పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి నెల్లూరు నగర నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనుక్రాంత్ విజయం ఖాయమని ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మరియు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి భవాని రవికుమార్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్, బద్దిపూడి సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్సులు మున్వార్, గూడూరు వెంకటేశ్వర్లు జిల్లా అధికార ప్రతినిధులు కరంపూడి కృష్ణరెడ్డి, కలువాయి సుధీర్ జిల్లా కార్యదర్సులు షేక్ అలియా, హరి రెడ్డి కోవూరు నాయకులూ చప్పిడి శ్రీనివాసులు సర్వేపల్లి నాయకులూ సురేష్, కావలి నాయకులూ సిద్దు తదితరులు పాల్గొన్నారు.