జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై చేజర్ల మండలం నుండి పలువురి చేరిక

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఉపన్యాసానికి మరియు సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆదివారం ఆత్మకూరులోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ చేతుల మీదగా చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రాబోయేది జనసేన ప్రభుత్వమేనని కాబోయే సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఘంటాపధంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, బలరాం, అరవింద్ మరియు అన్ని మండలాల ఇన్చార్జిలు మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగింది.