బిల్లమడ గ్రామంలో ఘనంగా జనసేనపార్టీ కార్యాలయ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, భామిని మండలంలో మండల స్థాయి “జనసేన పార్టీ కార్యాలయం” ప్రారంభోత్సవానికీ ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా నాయకులు అయిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు, వీర మహిళ “కాంతి శ్రీ” మరియు ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి “పేడాడ రామ్మోహన్, పాల్గొని కార్యాలయం ప్రారంభం చేశారు. అనంతరం పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్బాన సత్తిబాబు సమక్షంలో పార్టీ జెండాను ఎగరవేశారు.

ఈ కార్యక్రమంలో కాంతి శ్రీ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రతి పల్లెకు వెళ్లే విధంగా కార్యాలయంలో ఎల్లప్పుడూ ప్రజా సమస్యల కోసం పోరాడే విధంగా పార్టీ కార్యాలయం ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ భామిని జనసైనికులు అందరూ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలియజేశారు. గతంలో జనసైనికులు చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేశారు. వాటిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని, ప్రతి జనసైనికుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యులతో జనసేనకి ఓటు వేయించాలని , 2024లో ప్రజా ప్రభుత్వం వస్తుందని, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని సభా సమేతంగా తెలియజేశారు.
పాలకొండ జనసేన నాయుకులు గర్భాన సత్తిబాబు బాబు మాట్లాడుతూ 80మంది కౌలు రైతులు చనిపోతే జగనన్న పట్టించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ కి ఓటు వెయ్యకపోయినా పవన్ కళ్యాణ్ ని రెండు చోఫ్ట్లా ఓడించినా 80మందికి ఒకొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 80లక్షలు ఇవ్వడం జరిగింది ఇలాంటి నాయకుడిని మనం ఎన్నికొకపోతే మనలని కాపాడే వాళ్ళు ఉండరు అని తెలియజేశారు.. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులుకు సన్మానం చేసి, 2022- డైరీ చిరు గుర్తుగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో సుబ్బు వీరఘట్టం మండల జనసేన ఎంపీటీసీ అభియార్థి వజ్రగడ జానీ అలాగే పాలకొండ నియోజకవర్గ జనసైనికులు అయిన పొట్నూరు రమేష్, ప్రశాంత్, వాసు, మన్మధ సీతంపేట జనసైనికులు అయినా శ్రీకాంత్, ఉపేంద్ర, చిన్న, విశ్వనాధం, భామిని మండలం నాయకులు మరియు కిరణ్, శ్రీనువాసురావు, కిషోర్, మహేష్, శరత్, తేజ, మనోజ్, వైకుంఠ, ప్రవీణ్, వీరమహిళ ఉష మరియు జనసైనికులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.