రామచంద్రుని ప్రతిష్ట సందర్భంగా బొబ్బిలిలో పలు సేవా కార్యక్రమాలు

బొబ్బిలి నియోజకవర్గం: అయోధ్య శ్రీ రామచంద్రుని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని గేదల శివ ఆధ్వర్యంలో గొల్లపల్లి జనసైనికులు తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో గొల్లపల్లి జనసైనికులు మరియు బొబ్బిలి జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.