చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా

రాజోలు: కత్తిమండ ఆరేటి వారి మెరకకు చెందిన ఆరేటి వెంకట సత్యనారాయణ కుమారుడు ఆరేటి లక్ష్మీ సుబ్రమణ్యం పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్బంగా వారు అందించిన ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా శనివారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రామరాజులంక మరియు మట్టపర్రు గ్రామ ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 4 ఉచిత త్రాగునీరు ట్యాంకర్లు సరఫరా చేయడం జరిగింది.