చిలకలూరిపేట జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

చిలకలూరిపేట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో బోయపాలెం గ్రామంలో నిర్వహించిన పార్వతి దేవి అమ్మవారి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెంటేల బాలాజీ విచ్చేసారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు ఎస్ రమణమూర్తి, బాలాజి మరియు జనసేన నాయకులు కార్యకర్తలను సాదరంగా ఆహ్వానం పలికి పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యలతో ఉండాలని, 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని విశేష పూజలు మరియు కుంకుమ ఆర్చనలు నిర్వహించి ఆశీర్వచనం చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఝాన్సీ లక్ష్మి బాయ్ వీరమహిళలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరొక కార్యక్రమంగా చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి రోగులకు పండ్లు, బ్రేడ్ పంచుతూ రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో సౌకర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తున్నారని, వారికి చల్లని దీవెనలు అందిస్తున్నారని, ఆంధ్రరాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొని ఉందని, శనివారం కార్యక్రమాలు కూడా తెలియచేసారు. ఉదయం 7 గంటలకు ఓగేరు వాగు ప్రక్కన ఉన్న పెద్ద అయ్యప్ప స్వామి దేవాలయంలో పావన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా అఖండ గణపతి హోమం నిర్వహిస్తున్నామని, 9:30 నిముషాలుకి కళామందిర్ సెంటర్ లో 50 కేజీ ల భారీ కేక్ కటింగ్ కార్యక్రమం, తదుపరి నర్సరావుపేటలో జరిగే భారీ ర్యాలీలో పాల్గొంటామని, మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం, 2 గంటలకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, 4 గంటలకు కేక్ కటింగ్, 5 గంటలకు యడ్లపాడు గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు ఉన్నవ గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటామని బాలాజి అన్నారు. రేపటి కార్యక్రమాలలో జనసేన నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి అచ్చుకోల ఎల్. బి నాయుడు, నాదెండ్ల మండల అధ్యక్షులు కోసన పిచ్చయ్య, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్లా కోటి, ఉన్నవ గ్రామం అధ్యక్షులు సాంబశివరావు, గల్లా కోటేశ్వరరావు, చిలకలూరిపేట మండలం నాయకులు తిమ్మిశెట్టి కోటీశ్వరరావు, తోటకూర అనిల్, వీరమహిళలు అమరేశ్వరి, కొసన తిరుపతమ్మ, మానస, కోటేశ్వరమ్మ, కోటమ్మ, గల్లా లక్ష్మి, పట్టణ నాయకులు ముద్దా యోబు, వెంకటేష్, అచ్చుకోల అరుణ్, గోవిందు గణేష్, పెద్దింటి చంద్ర, పగడాల వెంకటేశ్వర్లు, పెద్దింటి అనిల్, యడ్లపాడు మండల కార్యదర్శి బొందాలపాటి సుబ్బారావు, ఎస్ ఆర్ శ్రీను, జగదీష్, కోటి, సన్నీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.