బాధితులకు అండగా నిలిచిన పవన్ సేన- సేవా సమితి

రాజానగరం: రాజాం నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పవన్ సేన- సేవా సమితి ద్వారా ఆదివారం యాక్సిడెంట్ కు గురై గత రెండు సంవత్సరాల నుండి ఇంటికే పరిమితమై ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న రేగిడి ఆముదాలవలస మండలం, కొమిరి గ్రామనికి చెందిన జనసైనికుడు బొత్స రమేష్ కు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అదే విదంగా రాజాం మండలం, గార్రాజు చీపురుపల్లి గ్రామానికి చెందిన తుర్ల చిన్నమ్మడు పూరిల్లు శుక్రవారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. వారి కుటుంబాన్ని ఆదుకొనేందుకుగాను రాజాం జనసేన పార్టీకి చెందిన జనసేన పవన్ సేన – సేవా సమితి సభ్యులు ఆ గ్రామానికీ వెళ్లి భాదితులకు నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి, కొంత నగదును అందిచటం జరిగింది.