గూడూరుపంచాయతీలో జనసేనలో భారీ చేరికలు

రంపచోడవరం: గూడూరు గ్రామం పంచాయతీలో సోడే వెంకయ్య సున్నం సూరి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి 20 కుటుంబాలు జనసేన అధ్నేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా చింతూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మడివి రాజు పాల్గొని వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మడివి రాజు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రజలు దగ్గరకి బలంగా తీసుకువెళ్లాలని, తద్వారా రాష్ట్రంలోను, మండలంలోనూ జనసేన పార్టీ అధికారంలోకి రావాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతూరు మండల ముఖ్య నాయకులు తీగల రవి, కవిత, చిలకం కన్నారావు, కారం దుర్గారావు, కలుమూల రమణారావు, మొదలగు వారు పాల్గొన్నారు.