మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య

మహబూబ్‌నగర్: జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని భగీరథ కాలనీ సమీపంలో నరహరి అనే ఉపాధ్యాయుడిని దుండగులు గొంతు కోసి చంపారు. బుధవారం రాత్రి నరహరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. అయినా అతడు మృతిచెందక పోవడంతో.. కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య మహబూబ్‌నగర్ పట్టణంలో సంచలనంగా మారింది. మృతుడి భార్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే కావడం గమనార్హం.