మలికిపురం లో విద్యార్థుల మానవహారం

మలికిపురం నాలుగు రోడ్ల కూడలిలో సీఎం డౌన్ డౌన్ అంటూ మానవహారం చేపట్టిన విద్యార్థులు…

మలికిపురం మండలం మలికిపురం లో సీఎం విద్యా వ్యవస్థల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలు కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని మలికిపురం ఏ ఎఫ్ డి టి కళాశాల విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి , రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు చేశారు. రాను రాను విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వ లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడతామని విద్యార్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.