నెల్లూరు సిటీ జనసేనలో భారీ చేరికలు

  • నమ్మండి నడవండి పవన్ కళ్యాణ్ గారితో
  • డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎత్తుగా ఏర్పాటు చేసి దళిత వర్గాలను ఉద్ధరించినట్లు మాట్లాడితే కుదరదు జగన్ గారు ఈ నాలుగు సంవత్సరాలు వైసిపి శ్రేణులు వారిపై జరిగిన దాడులను అందరూ గమనిస్తూనే ఉన్నారు.

నెల్లూరు సిటీ: సన్నాయి పవన్, సాజిత్, బలరాం, రోషన్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది యువత జనసేన పార్టీలో చేరింది.. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జనసేన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రతి గడపకు పవన్ కళ్యాణ్ గారి, పార్టీ నిర్ణయాలు తీసుకు వెళ్ళ వలసిందిగా పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెనుకే నడుస్తుంది. రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ గారి పై కపట బుద్ధితో లేనిపోని ప్రచారాలు చేసి మిత్రపక్షలకు తగులు పెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు ఆనంద పడుతున్నారు. విష ప్రచారం అంతా కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నుంచి రావడం గమనించదగిన విషయం. అందరికీ రాజ్యాధికారం రావాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నాలుగు సంవత్సరాల మీ పాలన లో అనుభవించిన బాధలు, కష్టాలు మరచిపోలేదు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వారి నిర్ణయం ఏదైనా కూడా మేమంతా నమ్మండి నడవండి పవన్ కళ్యాణ్ గారితో అనే నిదానంతో సార్వత్రిక ఎన్నికల్లో జనసైనికులు అందరూ కూడా ఏ నియోజకవర్గాలు ఎవరిని ప్రకటించిన కూడా ప్రతిగడపతో జనసేన కండువా మరియు జండాలతో పాల్గొని ప్రజా ప్రభుత్వానికి ఏర్పాటు కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షాజహన్, సన్నాయి పవన్, సాజిద్, రోషన్, బలరాం తదితరులు పాల్గొన్నారు.