జనసేన పార్టీలోకి భారీ చేరికలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం మండలం, కొమ్ముగూడెం గ్రామం నుంచి జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ భావజాలాలు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ దృక్పథం నచ్చి సోమవారం సాయంకాలం తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు ప్రసాద్ మరియు లైనింగ్ కమిటీ నాయకులు మట్టా రామకృష్ణ సహకారంతో సూర్పన శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందమందికి పైగా శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో 34 వార్డు 35 వార్డు నుంచి తిరుమల సూరిబాబు మరియు సండక రమణ మరియు యాడ్లపల్లి శ్రీను, బసివిరెడ్డి ప్రశాంతి సహకారంతో భారీ ర్యాలీగా శ్రీనివాస్ గృహానికి చేరుకొని పార్టీ సిద్ధాంతాలు నచ్చి శ్రీనివాస్ చేసే కార్యక్రమాలు నచ్చి వైసీపీ పార్టీ నుంచి రమణ మరియు వార్డు మహిళలు కార్యకర్తలు వంద మంది పైగా శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ ప్రజల నుంచి జనసేన పార్టీకి మంచి స్పందన వస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీసీలకు పెద్దపీట వేసి బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకువచ్చారని, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కరోనా సమయంలో లక్షల రూపాయల్లో చేసిన సేవ కార్యక్రమాలు గాని ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అన్న గానే వెంటనే స్పందించే మంచి మనిషి శ్రీనివాస్ అని పట్టణ వార్డుల ప్రజలు శ్రీనివాస్ కి వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడాలని వార్డు నుంచి భారీగా జనసేన పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి శుభపరిణామం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఒక మంచి మార్పు కోరుకుంటున్నారని దానికి నిదర్శనం అందరూ అన్ని పార్టీల నుండి జనసేన పార్టీలో చేరడమే అని తాడేపల్లిగూడెం ఇప్పుడు ఏమి డవలప్ జరిగిందో ఇక్కడ ఉన్న మంత్రి చెప్పాలని, మీరు ఇచ్చే పథకాలు ఎవరి డబ్భులతో ఇస్తున్నారో చెప్పాలన్నారు.ఇసుక మద్యం తో రాష్ట్రాన్ని వైస్సార్సీపీ పార్టీ నాయకులు దోచుకుంటున్నారని మా అధినేత పవన్ కళ్యాణ్ నిస్వార్థ రాజకీయ నాయకుడని పవన్ కళ్యాణ్ కి సేవ చెయ్యడానికి మనకోసం రాజకీయాల్లోకి రావడం జరిగిందని అందరూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం ని చేయాలన్నారు. అంతే కాకుండా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణం చేత తాటాకుల ఇల్లు దగ్ధమై ఆస్తి నష్టం జరిగి నిరాశిస్తులైన దంపతులకు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు పట్టింపాలెం సర్పంచ్ బోనిగే పోతన మరియు జనసేన సైనికుల సహకారంతో తక్షణమే 10000 అందించి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముత్యాల లక్ష్మణరావు, ముప్పిడి రవి, కసాగాని నాగరాజు మరియు తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, లైజనింగ్ కమిటీ నాయకులు మట్టా రామకృష్ణ, పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, కేశవభట్ల విజయ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బైనపాలేపు ముఖేష్, జనసేనపార్టీ నాయకులు బుద్దన బాబులు, చాపల రమేష్, పిడుగు మోహన్ బ్రదర్స్, జామ్ శెట్టి ప్రసాద్, నల్లగంచు రాంబాబు, అడ్డగర్ల సురేష్, మద్దాల నరసింహ, అత్తిలి బాబి, కాజులూరి మల్లేష్, అర్జుల కిషోర్, బద్దిరెడ్డి రత్తయ్య, దాగరపు శీను, ద్వార బంధం సురేష్, నరాల శెట్టి సంతోష్, తాడి మనిధర్, సోమ శంకర్, ఏపూరి సాయి మరియు వీరమహిళ విభాగం జిల్లా కో ఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షురాలు వెజ్జు రత్న కుమారి, ముద్దాల చిన్ని, తల్లాది మధుమతి, తదితరులు పాల్గొన్నారు.