గెంజిగడ్డ గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలం, గెంజిగడ్డ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు పర్యటన చేసారు. ఈ సందర్బంగా అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య గెంజిగడ్డ గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం గిరిజనులకు చేసిన మేలుకంటే చేస్తున్న అంతర్గత నష్టాలే ఎక్కువని అన్నారు. యువత, శ్రామికుల, రైతుల నడ్డివిరిచిందన్నారు ఉదాహరణకు గిరిజన నిరుద్యోగులకు జీవో నెం3 కల్పతరువు లాంటిదని కానీ దానిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, ఈ విదంగా యువతకు తీరని ద్రోహం చేసిందన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ కేలండర్ విషయంలో యువతను నట్టేట ముంచిందని అన్నారు. అలాగే ఆదివాసీ గ్రామీణ ప్రాంత రైతులకు గతంలో లోన్ సౌకర్యం కలిపించి సబ్సిడీ తో దుక్కిఎడ్లు, పనిముట్లు సరఫరా చేసి జిసిసి సంస్థ ద్వారా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేవారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల దగ్గర దోచుకునేల సంస్కరణలు చేస్తూ దళారులకు మద్దతు ధర ప్రకటించి అందుకుంటున్నారు. గతంలో పాలించిన టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ రెండు పార్టీల ప్రధాన ఎజెండా అధికారం చేపట్టడమే కానీ ప్రజాపాలన దిశగా అలిచన చేసేవి కాదు. కేవలం ఒక వర్గం ఓటుబ్యాంక్ ని కాపాడుకోవడం కోసం మోసపూరిత తీర్మానాలు చేస్తూ ఇంకో జాతి ఆస్తిత్వంపై బహిరంగంగా యుద్ధం ప్రకటించడమేమిటో చూస్తే వారి అధికార దాహం అర్ధమవుతుంది. బోయవాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే నష్టపోయేదెవరు. ఈ రెండు సమాజికవర్గాల్లో ఎవరు అభివృద్ధి చెందిన జాతి ప్రజలకు సులభంగానే అర్ధమవుతుంది కానీ ఈ రెండు పార్టీలు చేసే మోసాన్ని గుర్తించడంలో మాత్రం గిరిజనులు తమను తామే మోసం చేసుకుంటున్నారు. ఇకపోతే మన ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు మన గొంతు అసెంబ్లీ వేదికగా వినిపిస్తారేమో అనుకుంటే నోట్లో గుడ్డ పెట్టుకుని గురక పెట్టి నిద్రపోయారు. ప్రస్తుతం జగనన్న సురక్ష పధకం ద్వారా అన్ని సేవలు మీ ఇంట్లోనే అంటూ ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. నిజానికి గడిచిన 4సంవత్సరాలు ఈ సురక్ష పధకం చేపడితే అందరూ ప్రభుత్వ పథకాలకు అర్హులే అవుతారు. అందుకే ఇన్నాళ్లు ఆపుతూ ఇప్పుడు ఎన్నికలకు ముందుగా ప్రభుత్వ పథకాలు రావాలంటే జగనన్న సురక్షలో మీ సమస్యల్ని తీర్చుకోండి. తద్వారా ప్రభుత్వ పథకాలు పొందండి అంటూ దండోరాలు వేపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా ఏమి చేస్తున్నట్టు?నిద్రపోయారా ప్రభుత్వ నాయకులు, గిరిజన నాయకులు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంటే ఒక కొత్త ప్రణాళిక ప్రశాంత్ కిశోర్ ప్లాన్ అమలు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం గిరిజన జాబితాలో బోయవాల్మీకిలను చేర్చాలని తీర్మానం చేసి గిరిజనులకు మోసం చేసిందని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అదే తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం నివేదిక పంపిందని అన్నారు. ఈ విదంగా చూస్తే టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా గిరిజన ద్రోహానికి పాల్పడిందని కాబట్టి టీడీపీ, వైసీపీ గిరిజన ద్రోహుల పార్టీలని అన్నారు. జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ.. గిరిజన జాతి పై కక్షకట్టి ద్రోహానికి పాల్పడే దుశ్చర్యలు చేస్తుంటే మనం మాత్రం వాళ్ళకి వంతపాడుతూ మన జాతిని మనమే నాశనం చేసుకొనే ఆలోచన చేస్తున్నాం. అందుకే మేము ఈ సందర్బంగా యావత్ గిరిజన జాతికి చెప్పెదోకటే అభివృద్ధి కాంక్షించాలంటే పారదర్శక రాజకీయాలకు మారుపేరైన జనసేన పార్టీ మాత్రమే అటువంటి నిబద్ధత, నిజాయితీగల పరిపాలన చేస్తుంది. అందుకే యువత జనసేన పార్టీకి కొండంత బలం. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ అస్తిత్వం కోల్పోతే గిరిజన జాతి అంతమవ్వడం ఖాయమని అన్నారు. ఈ సందర్బంగా గెంజిగడ్డ యువత భారీఎత్తున జనసేన పార్టీ కండువాలు గంగులయ్య ద్వారా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ చేరిక జనసేన నాయకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సమావేశంలో తాంగుల రమేష్, చింతపల్లి నాయకులు చెట్టి స్వామి, రవికుమార్, సన్ముఖ్, బాలరాజు, కొండబాబు, నగేష్, అశోక్ సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు.