జనసేన పార్టీలో చేరిన మాడెం గ్రామ యువత

పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు చేపడుతున్న గ్రామ పర్యటనలో భాగంగా గూడెం మండలం, మాడెం గ్రామ యువతతో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మరియు వారి బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రామ యువతతో మాట్లాడుతూ.. కేవలం జనసేనపార్టీ తోనే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. మన ప్రకృతి సహజ సంపద పరిరక్షింపబడుతుంది కానీ మిగతా అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ వలన నాశనమే కానీ రక్షింపబడే అవకాశాలు లేవు. వారి ఆలోచన విధానాలు అలాంటివి ఈ రెండు పార్టీలకు గిరిజనులను కనీసం మనుషులుగా చూసే సంస్కృతి లేదన్నది సుస్పష్టం ఎంతసేపు వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయవసరాలు, రాజకీయాధికారాలు కోసమే వీళ్ళ ఆలోచనలు ఉంటుంది. ఉదాహరణకు చింతపల్లి మండల మాజీ ఎంపిపి బాబురావు ఉదంతమే ఇందుకు నిదర్శనం. మండలంలో ప్రజాదరణ పొందిన వ్యక్తిని కుట్రలు చేసి ఇవాళ పదవీచ్యుతుడిని చేశారు. ఇప్పటికైనా వాస్తవరాజకీయలు పరిశీలించి తమ ఓటును వినియోగించుకోవాలి. నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో గోరంగా ప్రభుత్వ వైఫల్యామైందని అన్నారు. మారుమూల పల్లెల్లో నుంచి అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు వైద్యానికి తరలించాలంటే రోడ్డు లేని కారణంగా గర్భిణులు మృత్యువాత పడిన సందర్భాలు చూశాం. ఇలా మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఆలోచన వారికి లేకపోవడం సగటు గిరిజనం పరిస్థితులు చూస్తుంటే మన రాజకీయ అజ్ఞానమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 75 ఏళ్ళ సుదీర్ఘ గిరిజన రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే మన పాలకులు సాధించిన ప్రగతి ఇదేనా..?. ఎంతమందికి అధికారం ఇచ్చాం ఎన్ని పార్టీలకు ఆధరించం కానీ మనల్ని అక్కున చేర్చుకున్న ఏ రాజకీయపార్టీ లేదన్నది వాస్తవం. మనం ఓటువేసి గెలిపిస్తే వారు ప్రభుత్వం దగ్గర సూటుకేసు చూసి పాలిస్తున్నారు. ఫలితంగా మన ప్రాంతంలో మనం పరాయి వాళ్ళు అయిపోతున్నాం. వారు అమ్ముడుపోయారు మనల్ని మన భవిష్యత్ తరాలని మన ప్రకృతి సంపదను అమ్మకానికి పెట్టారు. ఇది గిరిజన ప్రజానీకానికి మోసం దగా చెయ్యడం కాదా?.. కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసమే ఆలోచన చేశారు కానీ తమ జాతి కి ఏదైన చెయ్యాలనే దృఢసంకల్పం వీరిలో ఎక్కడ చూసినా మచ్చుకైనా కానరాదు. నాగరిక సమాజంతో మనల్ని పోల్చుకుంటే ఇంకా అనాగరికంలో నెత్తివేయబడుతూనే ఉన్నాం తప్పితే నాగరిక సమజాభివృద్ది దిశగా అడుగుపడకపోవడం మన పాలకుల పాలన తీరుకి నిదర్శనం. గిరిజన రాజకీయాలు ముఖ్యంగా కుటుంబ బంధు ప్రీతి రాజకీయాల్లో మునిగి తేలుతున్నాయని అందులో అభివృద్ధి జరుగుతుందని కానీ కేవలం వారి కుటుంబ రాజకీయభివృద్ది, వారి ఆస్తి అభివృద్ధి మాత్రమే వృద్ధి చెందుతుంది తప్పితే గిరిజన బ్రతుకులకు ఎప్పటికి అందని ద్రాక్ష అభివృద్ధి ఫలాలు. ఇప్పటికైనా ఆదివాసీ సమాజం మార్పు దిశగా ఆలోచన చేసి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఎటువంటి కేసులు, అవినీతి మరకలు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వెంట నడుద్దామని గంగులయ్య తెలిపారు. జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది కారణం ఇక్కడ కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయ మార్పు రావాలి అనుకునే యువతరం ఆలోచన ఉందని, ఒక రకంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన ఉపకులాలు అందరూ గిరిజనులే కానీ తమను తాము అధికారంలోకి రావడానికి కుల రాజకీయాలు చేసే సంస్కృతి ప్రబలిపోయిందని ఈ విధానం రాజకీయాలలో మంచి పరిణామం కాదని అన్నారు. అలాగే నా తోటి కువి సోదరులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. దశాబ్దాలు తరబడి మోసానికి గురౌతున్నాం రాజకీయంగా చైతన్యవంతులు కాలేకపోతున్నాం. బండెడు అవినీతి కేసులున్న వారికి అధికారం ఇస్తున్నాం, సేవ చేసే గుణవంతులను గుర్తించలేకున్నాం. ఎన్నికల సమయంలో హామీల వర్షం కుమ్మరించి గంపగుత్తుగా ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసి తీరా ఎన్నికల ప్రచారంలో కనిపించే వాళ్ళని నమ్ముతున్నంత కాలం మన బ్రతుల్లో మార్పు రాదని అన్నారు. అందుకే ఎంతో సేవాభావంతో రాజకీయాలను చూసే నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారిని చూసి మార్పే లక్ష్యంగా వస్తున్న జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు నచ్చి నియోజకవర్గ పరిధిలో యువత పెద్దఎత్తున చేరుతున్నారని, ఈ దశాబ్ద రాజకీయాలు యువకులదేనని మార్పుకోసం పాటుపడి రాజకీయ ప్రక్షాళన చేయడానికి నా వంతు బాధ్యతగా గంగులయ్యగారితో కలిసి నడుస్తున్నామని అన్నారు. సమసమాజం ఏర్పాటు కొరకు ఎన్నో అవాంతరాలు సహజమని అందుకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి జనసేన పార్టీ ఎప్పటికి సిద్ధంగా ఉంటుందని, ఇక్కడ మిగతా పార్టీలవలె కులగజ్జి రాజకీయాలకు తావులేదని, మార్పే ఆశయంగా జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధపడుతుందని యువత రాజకీయాల్లోకి చురుకైన పాత్ర పోషించాలని, లేదంటే యువతకు భవిష్యత్ లేదని అన్నారు ఈ సందర్బంగా జనసేన పార్టీ నాయకులు గంగులయ్య, రాజన్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని మాడెం గ్రామయువత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గూడెం నాయకులు కొయ్యం బాలరాజు, తాంగుల రమేష్, కోటి, బాలరాజు చింతపల్లి నాయకుల స్వామి, పాడేరు పట్టణ అధ్యక్షులు నగేష్, అశోక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.