కిల్లో రాజన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

  • గ్రామ గ్రామానికి జనసేన సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు తెలుపడమే మా లక్ష్యం

పాడేరు: ఏఎస్ ఆర్ జిల్లా జి కె వీది మండలంలో రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ సుడుగాలి పర్యటనలో భాగంగా, జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు నమ్మి, వైసీపీ, పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తలు, మరియు గ్రామస్థులు, రాజన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కండువాలు కప్పి సాధారణంగా పార్టీలో ఆహ్వానించారు. రాజన్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు వైసీపీ ప్రభుత్వము తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. 14,15 ఆర్ధిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులను, సైతం కాజేసి గ్రామాలకు మౌలిక సదుపాయాల, అభివృద్ధికి, తీరని ద్రోహం చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పకుండా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పనికి రాని పథకాలు, ఆశా చూపము కానీ ప్రజలకు ఏది అవసరమో…అది తప్పకుండా, మా ప్రభుత్వం చేస్తుందని, భరోసా ఇచ్చారు. యువతకు, ఉపాధి, అవకాశాలు, మెండుగా, ఉంటాయని, తెలిపారు. మా అధినేత పవన్కళ్యాణ్ గారు నిరుద్యోగులకు విషయంలో చాలా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని తెలియజేశారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ మీది, సరియయిన, స్పష్టతతో ఉన్నారని అన్నారు. పంచాయితీకి రావాల్సిన నిధులు చట్ట ప్రకారం రాజ్యాంగ, బద్దంగా, నేరుగా అందుతాయని, చెప్పారు. కావునా ప్రజలంతా, తాత్కాలిక అవసరాలు తీర్చే సంక్షేమ పథకాలే కాకుండా, భవిష్యత్ తరాల, అభివృద్ధి, కోసం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, కల్పన కోసం, ఆలోచన చేసి జనసేన పార్టీ నీ ఆదరించాలని కోరారు. మన హక్కులు మన చట్టాలు, రక్షించుకునే బాధ్యత, మన అందరి పై ఉందని పిలుపు నిచ్చారు. ఈ నియంత, హిట్లర్, పాలనను శ్వప్తి పలకాలని పిలుపునిచ్చారు. మీ విలువైన ఓటును బాధ్యత రహితంగా వేసి ఆంధ్రాని మరో వెనిజులా లా చేయొద్దని ప్రాధేయపడ్డాను. బాధ్యతగా ఓటు వేసి భావితరాల భవిష్యత్ ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జికె వీది మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, ఉపాధ్యక్షులు, బత్తుల సిద్దార్థ మార్క్, కార్యదర్శి, కూడ మధు కుమర్, మండల నాయకులు, గుండ్ల రఘువంశ, వనపాల, ఈశ్వరరావు, అరడ కోటేశ్వరరావు, రాము, జాగరపు బాలకృక్ష్ణ, జాన్, రాజు తదితరులు పాల్గొన్నారు.