ఏలూరులో నాదెండ్ల మనోహర్ సమక్షంలో భారీ చేరికలు

ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం పర్యటించడం జరిగింది. వట్లూరు బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్.వి.ఆర్ విగ్రహం వద్ద ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు జనసేన పార్టీ రాష్ట్ర పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి హోటల్ గ్రాండ్ ఆర్యకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఏలూరులో రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై నాదెండ్ల మనోహర్ సమక్షంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల నుండి సుమారు 200 మంది జనసేన పార్టీలోకి చేరారు. వీరిలో నగర ప్రముఖులు వ్యాపారవేత్తలు హోటల్ గ్రాండ్ ఆర్య అధినేత రాఘవయ్య చౌదరి, శ్రీ లక్ష్మీ నారాయణ ట్రాన్స్ పోర్ట్ అధినేత శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, కంచన బాబు, జనపరెడ్డి నాయుడు, స్వర్ణ కారుల సంఘం, ఇంజినీరింగ్ విభాగం, బ్రాహ్మణ సంఘాలు మరియు వివిధ సంఘాల నుండి సుమారు 200 మంది పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గోపాలపురం నియోజకవర్గంలో వైసిపి నుండి దొడ్డిగర్ల సువర్ణ రాజు మరియు ఇతర నాయకులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఇటీవల మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఆచంటకు చెందిన శిరిగినీడి వెంకట శ్రీరామ్ కుటుంబ సభ్యులకు, తాడేపల్లిగూడెంకు చెందిన బట్టు గోవిందరాజు కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు చెక్కులు అందజేసిన జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రమాదంలో గాయపడిన కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన దువ్వపు నాగన్నకు, నరసాపురం నియోజకవర్గం పేరుపాలెం గ్రామంకు చెందిన బల్ల రాంబాబుకు 50వేలు చెక్ అందజేసిన నాదెండ్ల మనోహర్. అనంతరం కార్యకర్తలు జనసైనికులను ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జరుగ్గుతున్న రాజకీయ పరిణామాలపై ప్రసంగించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), పిఏసీ సభ్యులు కనకరాజు సూరి, బొమ్మిడి నాయకర్, చేగొండి సూర్య ప్రకాష్, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కెకె, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, చంద్రశేఖర్, వీరమహిళ విభాగం రీజినల్ కోఆర్డినేటర్ కాట్నం విశాలి, తణుకు నియోజకవర్గ ఇంచార్జి విడివాడ రామచంద్రరావు, ఉంగుటూరు నియోజకవర్గ ఇంచార్జి పత్సమట్ల ధర్మరాజు, పోలవరం నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజు, చింతలపూడి ఇంచార్జీ మేకా ఈశ్వరయ్య, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.