ఆఫ్ఘన్‌లో భారీ పేలుడు.. 47కు చేరిన మృతుల సంఖ్య

 ఆప్ఘనిస్తాన్‌లోని కాందహార్‌ నగరంలోని ఇమామ్‌ బార్గా మసీదు సమీపంలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో  మృతుల సంఖ్య 47కు చేరింది.   శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా.. 53 మంది గాయపడ్డారు.  షియా వర్గానికి చెందిన మసీదులో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను దక్షిణ నగరంలోని సెంట్రల్‌ హాస్పిటల్‌ కి తరలించారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే…  ఈ పేలుడు ఘటనపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ స్పందిస్తూ… దాడికి తామే బాధ్యులమని పేర్కొంది.   అంతకుముందు ఇదే నెల 8వ తేదీన ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని షియాలకు చెంది మసీదులో జరిగిన పేలుడులో కనీసం 100 మంది మరణించిన సంగతి విదితమే.