తాడేపల్లిగూడెం జనసేనలో భారీ చేరికలు

తాడేపల్లిగూడెం: స్థానిక తాడేపల్లిగూడెం, మూడవ వార్డు వీకర్స్ కాలనీ నందు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన జి. లోవరాజు, అల్లు నాగ సత్యనారాయణ, అడ్డాల సత్యనారాయణ, మాలా సత్యకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరియు తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేసే సేవా కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరిన స్థానిక సామాన్య ప్రజలను జనసేన పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 ఎన్నికలలో నేరుగా ఆంధ్రప్రదేశ్ లో పోటి చేసినా, కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగాం, ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను, జనసేన నాయకులను, జనసైనికులను ఎంతగా ఇబ్బంది పెట్టిందో నాలుగు సంవత్సరాల నుంచి చూసాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తాడేపల్లిగూడెంలో ఏ ఒక్క అభివృద్ధి పనీ చేయలేదన్నారు. అంతేకాకుండా స్థానిక రోజువారి కార్మికుల గురించి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో పూట గడవక నరకయాతన పడుతున్నరని, కుటుంబాన్ని పోషించుకోవటం కూడా కష్టమైపోతుందని కార్మికులు ఈ మీటింగ్ లో కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రధానంగా ఇసుకను బ్లాక్ మార్కెట్ చేసి దానిని ఎప్పుడైతే ప్రధాన వనరుగా ఈ ప్రభుత్వం దోచుకోవడం మొదలైందో అప్పుడే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రజల తరుపున శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెంలో వైసీపీ ప్రభుత్వం తమ ధనదాహంతో నరకకూపంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. జగన్ చేస్తున్న అసమర్ధ పాలనతో సుఖసంతోషాలతో గడుపుతున్న ఒక్క కుటుంబాన్ని చూద్దామన్నా ఎక్కడా కనపడటం లేదన్నారు. కార్మికుల జీవన విధానాలపై పవన్ కళ్యాణ్ కు పూర్తి అవగాహన ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షపాతి అని అక్కడ స్థానికులకు బొలిశెట్టి శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన పట్టణ నాయకులు, జనసేన మండల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-05-23-at-8.13.12-PM-1024x471.jpeg