వరికూటి నాగరాజు యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

దర్శి నియోజకవర్గం: కురిచేడు మండలం, వి వై (ఎస్ టి) కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు యూత్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేసి ఎస్టీ సంఘ నాయకులు 10 వేల రూపాయల నగదు సహాయం అందజేసిన దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్శాధ్. ఈ కార్యక్రమంలో ఓబులాపురం కొండ, నీలిశెట్టి ప్రభు, అబ్బు సుబ్బు, సాయి, వీరమహిళలు లక్ష్మి, జగదీశ్వరి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు తెలియజేసిన నీటి సమస్య, రవాణా సమస్య మరియు విద్యుత్ సమస్య గురుంచి దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటీ నాగరాజు దృష్టి తీసుకొని వెళ్లి వాటి పరిష్కార దిశగా పని చేస్తాము అని హామీ ఇచ్చారు.