గిడ్డి సమక్షంలో భారీ చేరికలు

  • వివిధ పార్టీలకు చెందిన కుటుంబాలు 250 మంది జనసేనలో చేరిక

పి గన్నవరం, సమిష్ఠ పడటంతోనే విజయం సాధ్యమవుతుందని జనసేన తెలుగుదేశం పార్టీల సారధ్యంలో పి.గన్నవరం నియోజకవర్గంలో ఇరు పార్టీల జెండాలను రెపరెపలాడించేందుకు గ్రామస్థాయి నుండి నియోజకవర్గం స్థాయి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పి.గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న గిడ్డి సత్యనారాయణ ఈ పరిసయ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శిరీగినీడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పి.గన్నవరం మండల అధ్యక్షుడు సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పి.గన్నవరం మండలం ఊడిమూడి లంకలో జన్మించి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకున్నానని జూనియర్ కళాశాల విద్యను పి. గన్నవరం అంబాజీపేట మండలంలో పూర్తి చేశానని అక్కడినుండి వేరే ప్రాంతాల్లో కోర్స్ పూర్తిచేసి అనంతరం పోలీస్ శాఖలు ఉద్యోగం చేశానని అన్నారు. నది వదివాహక ప్రాంతంలో ఉన్న ఊడిమూడి లంక ఏడాదికి రెండుసార్లు వర్షం వరద నీటితో నీటమునిగి బాహ్య ప్రపంచంతో రాకపోకలు లేక ఇబ్బందులు పదేవాలుమన్నారు.ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత సొంత గ్రామానికి మండలానికి ఏదో చేయాలని తపనతో వారానికి రెండు రోజులు సొంత గ్రామానికి వచ్చి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని పవన్ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేసేవాడినని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతో సమాజ సేవకు ఉద్యోగ బాధ్యతలు అడ్డు రావడంతో రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నానని సమాజానికి తన వంతుగా ఏదో చేయాలని తపనతో అడంబరమైన జీవితాన్ని కోట్ల రూపాయలు సంపాదన పక్కనపెట్టి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకున్ని ఈ ఎడారి జనవరి 31న ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నానని సత్యనారాయణ తెలిపారు. ఈనెల 5 వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి పి.గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని నాలుగున్నరెళ్ళుగా ఈ నియోజకవర్గానికి ఇంచార్జ్ లేకపోయినా జనసేన సైనికులు జనసేన పార్టీని అభివృద్ధి బాటలో తీసుకొచ్చారని స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎంపీపీ తో పాటు గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు,వార్డు సభ్యులు గెలిపించుకుని జనసేన పార్టీ గౌరవాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారని అభినందించారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ నుండి 250 మంది నక్క నరేష్, కోట వీర వెంకట సత్యనారాయణ, మల్లాడి గోపి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పి.గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.