బహిరంగ చర్చకు సిద్ధం

ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు ప్రతి ఒక్క సమస్యపై స్పందిస్తున్నారు. ఇది ఓర్వలేక అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు 6 వ డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ నిరాధారమైన ఆరోపణలు మా ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడుపై చేస్తున్నారని ఏలూరు జనసేన నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, వీరంకి పండు మాట్లాడుతూ మా ఇంచార్జీ పై 6 వ డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల మీద అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ప్రశాంతంగా ఇంట్లో పడుకున్నారా అని నిలదీశారు. మీకు కళ్ళు కనిపించడం లేదా..?? ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వచ్చిన నిధులు ఏమైపోయాయి..?? మీరు ఏం అభివృద్ధి చేశారు..?? ఆళ్ళనాని గ్యారేజ్లో ప్యాచ్ వర్క్లు చేశారా..?? ఈ నాలుగు సంవత్సరాలలో చాటుపర్రు రోడ్లోని ఫిలాస పేటలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఎన్నో సార్లు మీవద్ద మొరపెట్టుకున్నారు. మేము జనసేన పార్టీ తరఫున నిరశన చేస్తే మీరు రోడ్లు వేశారు. స్థానికులు ఎన్నోసార్లు రోడ్లకు అడ్డంగా పడుకుని నిరసన తెలియజేశారు కదా. మీ డివిజన్ కార్పొరేటర్ గా మీకు గుర్తు లేదా..?? అని ప్రశ్నించారు. ఆరోజున అక్కడ ఉన్న గుంతల్లో చేపలు వేసి మరీ మీకు తెలియజేశాము. మీకు మీ నాయకులకు కళ్ళు కనపడటం లేదా..?? శ్రీకృష్ణ దేవరాయ స్కూల్ దగ్గర ఈ శిలాఫలకాన్ని 2020 సంవత్సరంలో వేశారు. అంటే మీరు గెలిచి నాలుగు సంవత్సరాలు దాటింది. ఇప్పటివరకు ఆ రోడ్డుకు మరమ్మత్తును ఎందుకు చేయలేకపోయారు..?? కనీసం ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ కూడా వేయలేకపోయారు. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఆ రోడ్డుని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే మీ డివిజన్లో మీ ఇంటి పక్క నుంచి ఇందిరమ్మకు కాలనీకి వెళ్లే రోడ్డుని మీరు వేయలేకపోయారు. దయచేసి ఆ రోడ్డుని మీరు చేయించుకోండి. ఈ ఐదు సంవత్సరాలలో కనీసం ఇది చేశామన్న గొప్పలైన మీరు చెప్పుకోవచ్చు. హనుమాన్ నగర్ శ్మశాన వాటికలో మొక్కలు మొలుస్తాయా అని అడుగుతున్నారు. మీరు గాని మీ నాయకులు గానీ ఎవరైనా ఈ శ్మశాన వాటికకు వచ్చి చూస్తే అక్కడి పరిస్థితులు ఇబ్బందులు మీకు తెలుస్తుంది. ఎవరైనా చనిపోతే నిల్చుని దహనం చేయడానికి కూడా వీలులేని పరిస్థితి, పూడ్చలేని పరిస్థితి ఏర్పడింది. అడవుల్లో మొక్కలు పెరిగినట్టుగా ఉన్నాయి అక్కడి మొక్కలు మీతో అక్కడి స్థానికులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న మీరు పట్టించుకున్నారా. హనుమాన్ నగర్ లోని స్థలం కబ్జాకు గురైందని మీరు అడుగుతున్నారు. మీరు 2006లో నాయుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లో లేరా..?? మీ నాని గారు ఎమ్మెల్యే కాదా..?? హనుమాన్ నగర్ కి మీరు ఈరోజు వస్తారా? రేపు వస్తారా? ఎప్పుడు వస్తారో రండి. బహిరంగ చర్చకు మేము సంసిద్ధం. అదే హనుమాన్ నగర్ స్మశానం దగ్గరికి రండి. ఇది 12 గ్రామాలకు చెందింది. పూర్వం ఊరు చివరలో ఉండేది. మా నాయుడు గారు ఎస్సిలు అందర్నీ కూర్చోబెట్టి ఈ స్థలాన్ని కేటాయించారు. మధ్యలో రోడ్డునీ వేయించారు. అందులో కొంత బీసీలకు కొంత ఎస్సీలకు కొంత కేటాయించారు. అప్పుడు అక్కడ ఉన్న గోడను మీ ప్రభుత్వమే కట్టారు కదా. ఆరోజు మీరు గాని మీ ఎమ్మెల్యే గాని నిద్రపోయారా..?? ఆ స్థలం కబ్జాకు గురైందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. శుభ్రంగా ఉండే ఎంతోమందికి ఉపయోగపడే ఫ్లాష్ సంస్థని కూలగొట్టింది మీ నాని గారు కాదా..?? ఈ ఘనత కూడా మీకే దక్కింది.. మీ 6వ డివిజన్లో భారీగా వసూలు చేస్తున్నారు. నీ ఒత్తిడిని నీ టార్చర్నీ తట్టుకోలేక పిడుగుల గాంధీ అనే ఒక అతను సంవత్సరం క్రితం సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకున్నారు. అప్పట్లో మీరు సెటిల్మెంట్ చేసుకోలేదా..?? మీ డివిజన్లో పంపు డిపాజిట్లు మీరు చెల్లించడం లేదు. మా ఉమ్మడి ప్రభుత్వం రాగానే అవన్నీ బయటకు తీస్తాము. మీ సంగతి తేలుస్తాము. మీరు అక్రమంగా పర్మిషన్లు ఇస్తున్నారు. ఇకనైనా మీరు మీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో బహిరంగంగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెంకటాపురం పంచాయతీ అయి మూడేళ్లు అయింది. వెంకటాపురంలో గోదావరి జలాల నుండి మున్సిపల్ మంచినీటిని రప్పిస్తున్నామని వాగ్దానాలు చేశారు. అది ఈరోజుకి నెరవేర్చకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికీ అశుద్ధ నీటిని తాగుతున్నారు అక్కడి ప్రజలు. దీని కారణంగా వాళ్లు అనేక రోగాలకు గురవుతున్నారు. ఎన్నిసార్లు మీకు మొరపెట్టుకున్న మీరు విన్నది లేదు పెట్టింది లేదు. కలుషితమైన నీరు వస్తుందని ఈ విషయం తెలిసిన రెడ్డి అప్పలనాయుడు గతంలో మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఏరియాలో తాగునీరు సరైన మంచినీరు రావడంలేదని ఆ ప్రాంతంలో బావిని తవ్వించారు. ఈరోజుకి అక్కడి స్థానికులు బావినీటినే తాగుతున్నారు. అయినప్పటికీ మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు మానం మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల్ని చేయకుండా మీరు ప్రజల వద్దకు వెళ్ళి అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారు. ఈరోజు దానిమీద ప్రతిపక్షాలు మాట్లాడకుండా మీరు చేయగలరా..?? ఈ గోదావరి జలాల్నే మీరు తీసుకొస్తారా. అక్కడి స్థానిక ప్రజలకు మంచి నీటిని అందిస్తారా లేదా. లేదంటే మీ లెక్కలు బొక్కలు అన్నీ కూడా తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ యొక్క ప్రతి విషయం మా దగ్గర డేటా ఉందని మా పార్టీ అధికారం లోకి రాగానే మీ పని పడతామని మీరు ఏ విధంగా ఐతే అవినీతి చేశారో జనాలకు తెలియజేస్తామని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో హెచ్చరించారు. మీడియా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, మీడియా ఇంచార్జీ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, సత్యనారాయణ, బెజవాడ నాగభూషణం, గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.