వైసీపీ నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, గుండ్లపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు సమక్షంలో వైసిపి నుండి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైకాపాది ఇక ముగిసిన అధ్యాయమే సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట్ అప్పారావు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశాడని అప్పారావు గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట్ అప్పారావు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి గ్రామంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రైతులు, పేదలకు మేలు చేసే విధానాలకు మేము ఆకర్షితులమై జనసేన పార్టీలో చేరుతున్నామని పార్టీలో చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, సత్తనపల్లి రూరల్ అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, మండల ఉపాధ్యక్షులు షేక్ రఫీ, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య చిలక సత్యం చిలక పూర్ణ, గట్టు శ్రీదేవి, ఉప్పు తోట్ల నాగేశ్వరావు, నక్క వెంకటేశ్వర్లు, పానుగంటి రామకృష్ణ, తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.