జనసేన పార్టీలోకి గిరిజన యువత

అరకు: ఏటా మెగా డీఎస్సీ, జాబ్ కేలండర్, లక్షన్నర ఉద్యోగాల భర్తీ వంటి హామీలు ఇచ్చి యువత ఓట్లు పొంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అధికారికంలోకి రాగానే ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి యువతను మోసం చేసింది. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జనసేన పార్టీకి మాత్రమే సాధ్యమని గ్రహించిన యువత జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో అరకు నియోజకవర్గంలోని హుక్కుంపేట మండలంలోని మొట్టుజార పంచాయతీ, నక్కలు పుట్టు గ్రామానికి చెందిన యువత అరకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చెట్టి చిరంజీవి మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా కార్యనిర్వహణా కమిటీ సభ్యులు పరధాని సురేస్ పాల్గొనటం జరిగింది. మండల నాయకులైన మజ్జి మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.