వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు

పోలవరం నియోజకవర్గం: టి. నరసాపురం మండలం, ఎపుకుంట పంచాయతీ, శ్రీరామవరం గ్రామంలో మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో అధికార వైసీపీ పార్టీ నుంచి కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, కరాటం ఉమా, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు సమక్షంలో కాల్నిడి లక్ష్మణరావు, బీరం రామారావు నేతృత్వంలో సుమారు 20 కుటుంబాలు, ఇరువురు సాఫ్టవేర్ వీరమహిళలు పార్టీలో చేరటం జరిగింది. హలో ఏపీ బై బై వైసీపీ అంటూ.. మొదలుపెట్టిన చిర్రి బాలరాజు అందర్నీ ఉత్సహపరుస్తూ వైసీపీ చేసే అక్రమాలు కళ్యాణ్ గారు బయటపెట్టడం వాళ్ళ నిజాలు అందరికి అర్ధం అవుతున్నాయని, పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి పార్టీకి అందరు అండగా నిలబడుతున్నారని, మీలాంటి సీనియర్ నాయకుల మద్దతు ఎంతో అవసరమని, 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏంచెయ్యలేని తెల్లం బాలరాజుకి పరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తామని, సంక్షేమ పధకాల పేరిట 30%మందికి మాత్రమే వస్తున్నాయి, మిగతా 70%మంది ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. కళ్యాణ్ గారి వ్యక్తిగతం మీద ఉన్న శ్రద్ధ ప్రజాసంరక్షణ, రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటే ఎప్పుడో మనం అభివృధిలో ఉండేవారమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చినపెంటారావు, రాంబాబు, బాలాజీ, జెట్ల సత్యనారాయణ, పెద్దింటి చంటి, ఆదిత్య రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.