గడుతూర్ కొత్తవీధిలో జనసేన పార్టీలో భారీ చేరికలు

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలం, గడుతూర్ కొత్తవీధి గ్రామస్తులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గడుతూర్ కొత్త వీధి గ్రామస్తుల పిలుపుమేరకు ఆదివారం ఆ గ్రామానికి జి.మాడుగుల జనసేన పార్టీ నాయకులు చేరుకుని వారితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ నాయకులతో గ్రామస్తులు మాట్లాడుతూ.. మేము జనసేన పార్టీతో కలిసి ప్రయనిస్తామని మా ఆదివాసీ ప్రజల క్షేమం పవన్ కళ్యాణ్ గారు చూస్తారనే నమ్మకముందని అన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ నాయకులు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మండల అధ్యక్షులు మసాడి భీమన్న, భూత్ కన్వీనర్ కొర్ర భానుప్రసాద్, కార్యనిర్వహన కమిటీ సభ్యులు తాంగుల రమేష్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల క్షేమం కావాలంటే సమూల రాజకీయ మార్పు అనివార్యమని, గిరిజన జాతి భవిష్యత్, గిరిజన వనరులు ఖనిజ సంపద దోచిపెట్టే బూర్జువా రాజకీయాల పార్టీలను నమ్మి ఎంత కాలం మనం మోసపోతూనే ఉంటామని, అందుకే ఇవాళ రాష్ట్ర యువత ప్రత్యామ్నాయ పారదర్శక ప్రభల శక్తిగా ఎదుగుతున్న జనసేనపార్టీతో కలిసి సమాజ శ్రేయస్సు కోరుతున్నారని. పాడేరు నియోజకవర్గంలో మెజారిటీ అభ్యుదయబావలున్న గిరిజన యువతరం ఇప్పుడు జనసేనపార్టీతో ప్రయనిస్తున్నారని గిరిజన ఆస్తిత్వము తాకట్టుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే కుళ్లు రాజకీయ ప్రధాన ప్రతిపక్ష, పాలకపక్ష పార్టీల అవినీతి మకిలి కడిగేసే సమయమిదేనని, మనమంతా మార్పుకోరకు, భవిష్యత్ తరాల కొరకు, గిరిజన అస్తిత్వ రక్షణ కొరకు కలిసి పోరాడుదమని, మీ వెన్నంటే వుండే పార్టీ కేవలం జనసేనపార్టీ మాత్రమేనని పవన్ అన్నకు అండగా ఉండమని మార్పు సాధిద్దామని జనసేన పార్టీ నాయకులు కిల్లో రాజన్ తెలిపారు. ఈ సందర్బంగా గడుతూర్ కొత్తవీధి గ్రామస్తులు మండల అధ్యక్షులు భీమన్న, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకుని జనసేనపార్టీలో చేరారు. మండల అధ్యక్షులుమసాడి భీమన్న, కార్యనిర్వహన అధ్యక్షులు తాంగుల రమేష్, మండల భూత్ కన్వినర్ కొర్ర భానుప్రసాద్ పాల్గొన్నారు.