నందిగామలో భారీగా జన చైతన్యం ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గంలో భారీగా జన చైతన్యం ర్యాలీని నిర్వహించిన నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని మరియు నేషనల్ యూత్ డే సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. పరిటాల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీలో జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ, స్వామి వివేకానందుడు మానవ జాతికి మార్గదర్శకుడు అని, అటువంటి మహనీయుని జయంతి రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించి యువత చేతిలో ఈ దేశ భవిష్యత్తు ఉందని చాటి చెప్పడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎంతోమంది మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో స్థాపించిన జనసేన పార్టీ. ఈరోజు జనసైనికుల ఐక్యతతో ఈ ర్యాలీ దిగ్విజయంగా సాగింది. ఈ ర్యాలీ ద్వారా రాబోయే 2024 ఎన్నికల్లో యువత వారి యొక్క బలమైన ఆయుధమైనటువంటి ఓటు హక్కుని వినియోగించి, జనసేన టిడిపి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ముఖ్యపాత్ర వహిస్తారని తంబళ్లపల్లి రమాదేవి ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గం మండలాధ్యక్షులు వడ్డీలు సుధాకర్, పొడుపు గంటి రామారావు, తాటి శివకృష్ణ, బేతంపూడి జయరాజు, తాటి వెంకటకృష్ణ, పవన్ ఆర్మీ పురంశెట్టి నాగేంద్ర, ధీరేంద్ర, కెదార్, కొట్టే బద్రి, తోట వేణు, రామిరెడ్డి వీరబాబు, గోపి, ఏడుకొండలు, వీర మహిళలు శ్రీహరిని, రంగ మాధవి, రమాదేవి, వెంకట నరసమ్మ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.