సీఐటీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న చిర్రి బాలరాజు

పోలవరం: జీలుగుమిల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల రౌండ్ టేబుల్ సమావేశంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. శనివారం జీలుగుమిల్లి మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద గత 33 రోజులుగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మొదటి రోజు నుంచి జనసేన పార్టీ మద్దతుగా నిలిచింది. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము అంగనవాడీలకు మద్దతుగా పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మా సమస్యలు తీర్చమని సమ్మెలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ వారికి ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోవడం, తిరిగి వారి మీదకు బెదిరింపు చర్యలకు దిగడం, ఉద్యోగాల్లోకి తిరిగి జాయిన్ అవ్వకపోతే వారిని ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం ఏంటని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం కోసం జనసేన పార్టీ తరపున ముందుకు వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూపా సత్యనారాయణ, కోల మధు, సూరిశెట్టి మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.