జనసైనికునికి భరోసా ఇచ్చిన మేడా గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, చక్రద్వారబంధం జనసైనికుడు కురుమాళ్ళ వంశీకి కాలు విరగడంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్ వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మాట చెప్పి రూపాయలు 5000/- నగదు చిన్నపాటి భరోసాగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, వైస్ ప్రెసిడెంట్ నాగవరపు భానుశంకర్, యూత్ ప్రసిడెంట్ సుంకర బాబ్జి, గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఆనందల గోవిందు, యూత్ ప్రెసిడెంట్ కడిమి దుర్గా రావు గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.