పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యపై స్పందనలో ఫిర్యాదు చేసిన జనసేన

నందిగామ, మండలంలోని పేరకలపాడు గ్రామంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యపై స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ఈవోపీఆర్డి శ్రీనివాసరావు, తహసిల్దార్ వి రాజకుమారిలకు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని, గ్రామంలో డ్రైనేజీ సదుపాయం లేక వర్షపునీరు కాలవలో చేరి రోడ్లపై నిలిచిపోతూ దుర్గంధం వెదజల్లుతుందని తెలిపారు. పలుమార్లు గ్రామపంచాయతీ సెక్రటరీ ద్వారా విన్నవించుకున్నప్పటికీ తాత్కాలికంగా పనులు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ ప్రాంతాలలో సమస్య ఎక్కువగా ఉందని కొన్ని పర్యాయాలు కాలువలలో ఉన్న మంచినీటి పైప్లైన్ కారణంగా మంచినీళ్లు సరఫరా సమయంలో మురికి నీరు సరఫరా అవుతున్నాయని వాపోయారు. మునుముందు సమస్య జఠలమై అంటువాదులు సోకే అవకాశం ఉంది కావున ప్రజా సంక్షేమం కోసం పేరకలపాడు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టవలసిందిగా కంచికచర్ల జనసేన పార్టీ తరఫున కోరుతున్నట్లు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ సురేష్, జర్రిపోతుల చంటిబాబు, పుప్పాల వేణుగోపాల్, మండల కార్యదర్శి కొటారు దేవేంద్ర, కంభంపాటి తిరుమలరావు, కుర్రా నాని, కటకం నవీన్ తదితరులు పాల్గొన్నారు.