పవన్ చిత్తశుద్ధి గురించి మాట్లాడే అర్హత మేడాకు లేదు

  • రాజంపేటలో జనసేన జెండాను ఎగరవేస్తాం
  • 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసి తీరుతాం..
  • విలేకరుల సమావేశంలో రాజంపేట జనసేన ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ధ్వజం

రాజంపేట నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిపై మాట్లాడే అర్హత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి లేదని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ప్రశ్నించారు. శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో చిత్తశుద్ధి లేదని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి అనడం ఆశాస్పదంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి గురించి ప్రశ్నించే అర్హత ముందు మీకు లేదన్నారు. రాజంపేట నియోజకవర్గంలో తొమ్మిది సంవత్సరాల కాలంగా వెళ్లబుచ్చి నేడు రాజంపేట నియోజకవర్గం ఏమీ లేని దిగజారుడు స్థితికి తీసుకొచ్చారన్నారు. రాజంపేట మండలానికి ఎక్కువ నియోజకవర్గానికి తక్కువ అనే స్థాయికి తీసుకొచ్చారన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి రాజంపేట ఒక పార్లమెంటు పట్టణంగా ఉండి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మల్లికార్జున్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఆల్విన్ ఫ్యాక్టరీ ఉండేది అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు లేవన్నారు. పార్లమెంటరీ ప్రతి పట్టణము జిల్లా కేంద్రంలో అయ్యుండి రాజంపేట పట్టణం మాత్రం జిల్లా కేంద్రం కాలేదన్నారు. కేవలం వందో, ఐదు వందలో ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నారన్నారు. రాజంపేటకు రావలసిన మెడికల్ కాలేజీ రానివ్వకుండా మదనపల్లికి తీసుకువెళ్లారన్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది డయాలసిస్ వ్యాధితో బాధపడుతూ తిరుపతి, కడపకు వెళ్లలేక బాధపడుతున్నారు. రాజంపేటకు డయాలసిస్ సెంటర్ తేలేని స్థితిలో ఉన్నామన్నారు. అన్నమయ్య డ్యాం తెగిపోవడానికి కేవలం ఇసుక క్వారీలను కాపాడుకోవడానికి గేట్లను సకాలంలో ఎత్తకుండా వందల కుటుంబాలు రోడ్డున పడి గుడిసెలలో బ్రతుకుతున్నారన్నారు. 48 మంది ప్రాణాలు కోల్పోయి 500 పైన ఇల్లు నేలమట్టమయ్యాయి అన్నారు. 200 ఇండ్లలో అన్న ఆస్తులన్నీ నీటిలో కొట్టుకుపోయాయన్నారు. వైకాపా నాయకులు ఒక్కరు కూడా వెళ్లలేదన్నారు. జనసేన ముందుండి బాధిత ప్రజలందరికీ ఆహారం నిత్యవసర సరుకులు బట్టలు అందించిన ఒక్క జనసేననే అన్నారు. కేవలం పదవుల కోసమే ఉన్న మీరు నేడు రాజంపేటను ఇంత అద్వాన స్థితికి తీసుకొచ్చిన మీకు నైతికతను మాట్లాడే అర్హత మీకు ఉందా అని ప్రశ్నించారు. మరోసారి పవన్ కళ్యాణ్ నైతికతను ప్రశ్నించే హక్కు గానీ విమర్శించే హక్కు మీకు లేదన్నారు. రాజంపేటలో జనసేన జెండాను ఎగరవేసి రాజంపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. గుండా రాజకీయాలు దౌర్జన్య రాజకీయాలు కాబట్టే ప్రజలు వైసీపీకి దూరంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టే ముద్దలకు 2019లో ప్రజలు ఓట్లు వేశారు కానీ 2024 ఎన్నికల్లో డిపాజిట్ కూడా రానివ్వకుండా ప్రతి నియోజకవర్గాల్లో అధికారం నుంచి తరిమికొడతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, ఆకుల నరసయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, హేమంత్, ఆచారి, రామా శ్రీనివాస్, వీరమహిళలు జడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.