జగన్ రెడ్డి కొంచెం నోరు అదుపులో పెట్టుకో!

కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ భైరవ ప్రసాద్

కదిరి నియోజకవర్గం: జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన జనసేన పార్టీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక మానసిక రోగి లాగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ముఖ్య మంత్రి కేవలం తమ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారు తప్ప ఒక ప్రజా ప్రతినిధిగా మాట్లాడటం లేదు. మీ అసమర్థ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మా నాయకుడు వారాహి యాత్రలో అడుగుతుంటే సమాధానం చెప్పలేక మూడు పెళ్ళిళ్ళు, దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ ఏదో పవన్ కళ్యాణ్ గారి ఫోబియా పట్టుకున్నట్లు మాట్లాడుతున్నాడు. జగన్ రెడ్డి ఒక విషయం గుర్తుంచుకో మా నాయకుణ్ణి విమర్శించే ముందు మీ ఇంట్లో ఉన్న వారికి వ్యక్తిగత జీవితాలు చూసుకొని మాట్లాడితే మంచిది మీ మాటల తీరు చూస్తుంటే గురుగింజ సామెత గుర్తుకు వస్తోంది. వాలెంటిర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టా రీతిలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ప్రైవేటు కంపెనీలకు అందిస్తున్నారు. వాలెంటిర్ గా పని చేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగస్తులా లేక మీ పార్టీ నియమించుకున్న కార్యకర్తలా అనే విషయం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఒకే వేళ వారు ప్రభుత్వ ఉద్యోగస్తులే అయితే పనికి వేతనం స్కేల్ అమలు చేసి 10000 జీతం ఎందుకు ఇవ్వలేదు?.. అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేవలం 5000 రూపాయలకు వెట్టి చాకిరీ చేయించుకున్నారు. జగన్ రెడ్డి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా మీ చీకటి బాగోతాలు బయటకు తోడాల్సి వస్తుంది అని భైరవ ప్రసాద్ మీడియా ముఖంగా ఈ జగన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల నాయకులు సాకే రవి కుమార్, భూక్యా రవీందర్ నాయక్, కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ఐటి వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, భాస్కర్, లాయర్ రవి, హరి బాబు, అంజిబాబు, శ్రీనివాసులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.