భూమిపూజ రోజు మీడియా సంస్థలు పాటించాల్సిన జాగ్రత్తలు

రామ మందిర భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి స్థానిక ప్రభుత్వ అధికారులు మీడియాకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. మీడియా సంస్థలు తగు జాగ్రత్తలు పాటించాలని అయోధ్యలోని ఉన్నతాధికారులు ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వివాదాస్పద కామెంట్లు చేసే, వ్యాఖ్యలు చేసే ఏ వ్యక్తులను కూడా డిబేట్లకు పిలవరాదని నిబంధన విధించారు.

భూమిపూజ సమయంలో మీడియా ప్రతినిధులందరూ భౌతిక దూరాన్ని పాటించాలని, విధిగా మాస్కులను ధరించాలని సూచించారు. ‘‘ఈ భూమిపూజను మీడియా కవర్ చేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. మీడియాకు ఓ సెపరేట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం. కరోనా నేపథ్యంలో ఒకేచోట గుమిగూడమని హామీ ఇవ్వాలి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని, సరైన ప్రోటోకాల్‌ను పాటిస్తామని హామీ ఇవ్వాలని అందులో చేర్చాం’’ అని ఓ అధికారి పేర్కొన్నారు.