పార్లమెంట్ భవనాన్ని కూల్చేదిశగా కేంద్రం

పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని, భద్రతా పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. అదేవిదంగా ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ భవన నిర్మించి ఇప్పటికి దాదాపు వందేళ్లు గడిచాయి. ఇప్పటికే ఇందులో చాలా సమావేశాలు జరిగాయి. ప్రస్తుత అవసరాలకు, సాంకేతికతకు ఈ భవనం సరిపోదు అని కేంద్రం పేర్కొంది.