మండల కార్యకర్తల సమావేశం విజయవంతం: పోలిశెట్టి తేజ

మైలవరం: ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామంలో జరిగిన మండల మరియు గ్రామ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేసిన స్థానిక జనసేన కార్యకర్తలకు గ్రామ అధ్యక్షురాలు తుంగం కుమారికి పోలిశెట్టి తేజ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల గాంధీ మాట్లాడుతూ మండలస్థాయిలో జనసేన మండల స్థాయిలో మరింత బలోపేతం అయ్యిందని భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రతీ గడపకు వస్తామని తెలిపారు. కేతానకొండ మరియు జూపూడి గ్రామ అధ్యక్షులు కొమ్మూరు వెంకటస్వామి, కాకి బాబురావు కి నియామక పత్రాలు అందచేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొమ్మూరి హనుమంతరావు మరియు సురేష్, నరేష్, నాని కార్యకర్తలు, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.