రాజానగరం మండలం జనసేన నాయకుల సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 16వ తేదీన మండపేటలో ఏర్పాటు చేసిన రైతు భరోసా యాత్ర కార్యక్రమం కోసం రాజనగరం మండలం నుండి కో ఆర్డినేట్ చేయుటకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్త ప్రసాద్ ఆధ్వర్యంలో
పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, రాజమండ్రి సిటీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ ని నియమించడం జరిగింది.

జనసేన పార్టీ రాజానగరం మండలం జనసేన నాయకుల సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం నందు మండపేటలో జరుగు కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా ఈ నెల 16 వతేదీన మండపేటలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విచ్చేయుచున్న కార్యక్రమం గురించి చర్చించే నిమిత్తము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ రైతు భరోసా యాత్ర లో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. మండల జనసేన నాయకులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ ప్రజలు, జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.