సెప్టెంబర్ 14 నుంచి సమావేశాలు

కోవిడ్ 19 నిబంధనలు, ఆంక్షల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభించడానికి నిర్ణయించారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకూ 18 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కరోనా వైరస్ నేపధ్యంలో భౌతికదూరం పాటిస్తూ ఇరు సభల్లో సభ్యుల స్థానాన్ని కేటాయించనున్నారు. రాజ్యసభ సభ్యులు లోక్ సభ, రాజ్యసభల్లో కూర్చోనుండగా…లోక్ సభ సభ్యులు మాత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కూర్చుంటారు.

ప్రతి ఎంపీ విధిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలనే నిబంధన ఉంటుంది. సభ్యులకు స్క్రీనింగ్ తోపాటు శానిటైజేషన్ వ్యవస్థ ప్రతిచోటా ఉంటుందని అధికారులు తెలిపారు. సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్ లో అనుమతి ఉండదు ఈసారి. మార్చ్ నెలలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా 12 బిల్లులు ఆమోదం పొందాయి. ఆ తరువాత రెండు సభలూ అర్ధంతరంగా వాయిదా పడ్డాయి.