తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం!

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం సమీపంలోని ఒడిశా చికిటి బ్లాక్ రొంప బరోడా యూత్ ఆర్గనైజేషన్ స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ ఎంకేసీజీ సాయంతో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి చేతులమీదుగా సోమవారం ప్రారంభించిన రక్తదానం శిబిరంలో 46 మంది రక్తదానం చేసారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో రక్తదానం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ.. బరంపురం ఎం.కే.సీ.హెచ్ హాస్పిటల్ నందు ఏ ఒక్కరూ రక్తం అందక ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ రక్తదానం శిబిరం ఏర్పాటు చేసామని తెలిపారు.